ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించిన
హంగేరి స్వీడన్ వాసులు
న్యూస్‌తెలుగు/చింతూరు : ఆయుర్వేద వైద్యంతో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను న్యాయం చేసే అపూర్వమైన శక్తి దాగి ఉందని నిరూపించిన విషయం బుధవారం తేటతెల్లమైంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ వద్దకు గత మూడు నెలల క్రితం కొరియర్ ద్వారా మందులు తెప్పించుకొని హంగేరి, స్వీడన్ కు చెందిన వారి సమస్యలు పరిష్కారం అయినందున. మరల బుధవారం రోజు రాజమండ్రి నుండి తమకు తెలిసిన తెలుగువారితో కలిసి నిమ్మలగూడెం గ్రామంలోని జమాల్ ఖాన్ ఆయుర్వేద వైద్యశాలకు తరలివచ్చారు. యూరప్ లోని హంగేరి దేశానికి చెందిన మౌనిక. స్వీడన్ కు చెందిన అనన్య బ్యాక్ పెయిన్, ఇతర సమస్యలు ఉన్నందున ఆయుర్వేద జమాల్ ఖాన్ మందులను వాడి నయం అయినందున మరల విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం పట్ల పూర్తి నమ్మకం కలిగిందని. వనమూలికలతో తయారైన మందులు ఎంతగానో నమ్మకంతో పని చేశాయని అందుకే మరల ఇండియాకు వచ్చి తమకు తెలిసినా ఇండియన్ తో కలిసి జమాల్ ఖాన్ ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించటం జరిగిందని ఆయన కలవడం చాలా సంతోషదాయకంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. (Story : ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించిన హంగేరి స్వీడన్ వాసులు)