కవి నూనె రమేష్ సాహితీ సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డు
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సంస్థగా పేరొంది సాహిత్య చరిత్రలో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ యస్ ఓ గుర్తింపు పొందింది. తెలుగు భాష – తెలుగు సంస్కృతి తెలుగు వైభవం- తెలుగు సాహిత్యం – తెలుగు కళలు పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మన్యం కవి నూనె రమేష్ కు సాహిత్య, సామాజిక రంగంలో చేస్తున్న సేవలనుగుర్తించి “జాతీయ యువ తేజం” ప్రతిభా పురస్కారాన్ని రచయిత నూనె రమేష్ విజయవాడ లో జరిగిన కార్యక్రమం లో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సి యి ఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ సమన్వయ కర్త కొల్లి రామావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, ఇతర జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. మూడు ప్రపంచ రికార్డ్ కవి సమ్మేళనాలలో పాల్గొని ప్రపంచ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకొని, పదుల సంఖ్యలో జాతీయ శతాదిక కవి సమ్మేళనాల పురస్కారాలు పొంది,ఐదు వందలకు పైగా సామాజిక ఈతివృత్తాలతో కవితలు వ్రాసి,రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాలలో కూడా సాహితీ పురస్కారాలు పొంది అనతి కాలంలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న కవి రమేష్ ను గ్రామస్తులు, మండల ప్రముఖులు, స్నేహితులు అభినందించారు. ఇంతటి ఘనత సాధించడం పట్ల నూనె రమేష్ తల్లిదండ్రులు నూనె అజరయ్య దంపతులు ఆనందం వ్యక్తం చేసారు.(Story : కవి నూనె రమేష్ సాహితీ సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డు )