సమస్యలను వెలికితీయడంలో
జర్నలిస్టుల పాత్ర కీలకం
డిపిఆర్ఓ సంపత్ కుమార్
విశాలాంధ్ర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
న్యూస్ తెలుగు – కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డిపిఆర్ఓ సంపత్ కుమార్ అన్నారు.బుధవారం జిల్లా సముకృత కలెక్టరేట్ లో 2025 నూతన సంవత్సర విశాలాంధ్ర క్యాలెండర్, డైరీల ను డిపిఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జర్నలిస్టులను అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ తమ సమస్యలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై పోరాడడం గర్వించదగ్గ విషయం అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించాక విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభించి నేటి వరకు ప్రజల అభిమానాలను పొందుతూ మంచి కథనాలతో అందరికీ పత్రిక అందుబాటులో ఉండడం గొప్ప విషయం అన్నారు. సమాజంలో అవినీతిని రూపుమాపేందుకు జర్నలిస్టులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఈర్ల సతీష్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కనుకుట్ల శ్రీనివాస్, పాత్రికేయులు బుచ్చిబాబు , ప్రేమ్, ఏ.ఐ.వై.ఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. (Story : సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం)