ఆందోళన అవసరం లేదు అందరికీ లబ్ధి చేకూరుతుంది
ప్రజాపాలన గ్రామసభల్లో ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని ఎవరు కూడా ఆందోళన చెందకూడదని నిరంతరాయంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభల సందర్భంగా మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఘణపురం మండలం ఉప్పర్ పల్లి, పెద్దమందడి మండల చీకరుచెట్టు తండా, ముందరి తండాలలో నిర్వహించిన గ్రామసభల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, లతో కలిసి గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ నుంచి అమలయ్యే రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు అర్హత గల లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం చేపట్టిన ఈ గ్రామసభలలో అర్హత గల వారిని గుర్తించాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాలలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని అర్హత గల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆయా మండలాల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తాసిల్దార్లు వ్యవసాయ అధికారులు ప్రత్యేక ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : ఆందోళన అవసరం లేదు అందరికీ లబ్ధి చేకూరుతుంది )