నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి 26 నుండి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన ప్రతి లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధి చేకూర్చేందుకు గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మొదటి రోజు కొత్తకోట మండలంలోని కానాయిపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభకు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ సభను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందన్నారు. ఈ జాబితాలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అనేది ప్రజల సమక్షంలో పెట్టీ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకురావడం జరుగుతుందన్నారు.
లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేష్, ఇతర అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. (Story : నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు)