శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లు నిర్మాణం
బస్ షెల్టర్ల నిర్మాణానికి స్థలాలు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజల ప్రయోజనార్థం వినుకొండ పట్టణంలో శివశక్తి ఫౌండేషన్ నుండి సొంత నిధులతో 4 ఆధునిక బస్‌షెల్టర్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. అనేక సంవత్సరాలుగా బస్ షెల్టర్లు లేక పట్టణంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడితో వారి ఇబ్బందులు తీరబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మంగళవారం అందుకు సంబంధించి స్థలాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలంగా బస్ షెల్టర్లు లేక పోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చినవారు, పట్టణం నుంచి ఎక్కడికైనా వెళ్లాలి అనుకునే వారు ఎంతో అవస్థపడుతున్నారని మున్సిపల్ కమిషనర్, కౌన్సిల్ తన దృష్టికి తీసుకుని వచ్చారన్నారు. ఆ మేరకు మార్కాపురం రోడ్‌లో, కారంపూడి రోడ్, నరసరావుపేట రోడ్, వెల్లటూరు రోడ్‌లలో బస్‌షెల్టర్లు నిర్మించబోతున్నామని అన్నారు. వినుకొండలోని నరసరావుపేట రోడ్డులో రెండు చోట్ల, కారంపూడి రోడ్డులో రెండు చోట్ల, మార్కాపురం రోడ్డులో ఒకచోట స్థలాలను పరిశీలించామన్నారు. రానున్న 2, 3 నెలల్లో వాటిని పూర్తి చేస్తామని,. ఇంకా ఎక్కడైనా కావాలని మున్సిపల్ కమిషనర్ కోరితే అవి కూడా నిర్మిస్తామని . ఇదే సందర్భంగా వినుకొండ సురేష్ మహల్ రోడ్డులో నిర్మిస్తున్న మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్‌నూ ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పురోగతిని జీవికి వివరించారు. వీరితోపాటు పీవీ సురేష్ బాబు, పి అయూబ్ ఖాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లు నిర్మాణం)