కృష్ణా జలాలకు పూజ చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఖిల్లా ఘణపురం మండలం మల్కాపురం గ్రామానికి చేరుకున్న కృష్ణమ్మ జలాలకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూజలు చేశారు. సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారమని గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు నాయకులకు అధికారులకు విన్నవించుకున్న గ్రామానికి అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణ నీటిని గ్రామానికి మళ్ళించారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో నీరొచ్చిన పొలాలపై పడి రైతు పొలాలకు అందేది కాదని నేడు D8 కాలువ నుంచి నేరుగా గ్రామానికి నీరందనంపై గ్రామస్తులు హర్షణ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకట్రావు, నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్,ప్రకాష్, కొండారెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : కృష్ణా జలాలకు పూజ చేసిన ఎమ్మెల్యే)