సోలిపూర్ ను మండల కేంద్రంగా అభివృద్ధి చేసుకుందాం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఖిల్లా ఘణపురం మండలంలో మేజర్ గ్రామపంచాయతీ అయిన సోళీపురం గ్రామాన్ని మండల కేంద్రంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సోలిపురంలో ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, తెలుగువాడలో ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సైతం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లోను విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో బలుపేతం చేసేందుకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , వనపర్తి శాసనసభ్యులుగా నేను తమకు కేటాయించిన నిధులను కేవలం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకే కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడల బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు క్రీడ పాఠశాలను ప్రారంభిస్తున్నారని అందులో ఒకటి వనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లో సోలిపురం తో పాటు పెద్దమందడి మండలంలోని వెల్టూర్ జంగమయ్యపల్లి బలిజపల్లి గ్రామాలను మండల కేంద్రాలుగా చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సోలిపురం లో సింగిల్ విండో, ఏర్పాటుతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామని వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకట్రావు, నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్,ప్రకాష్, మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : సోలిపూర్ ను మండల కేంద్రంగా అభివృద్ధి చేసుకుందాం)