జగనన్న కాలనీలో జరుగుతున్న
అక్రమాలపై చర్య తీసుకోవాలి
తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్ లో గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో ఒక సెంటు చొప్పున కొందరికి పట్టాలు ఇచ్చింది , అందులో అన్వర్లుగా ఉన్నవాళ్లు రెండు సెంట్లు,మూడు సెంట్లు, నాలుగు సెంట్లు ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దీనిపై స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గురువారం ప్రజాసంఘాలు ఆ స్థలాలను పరిశీలించి, అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తాసిల్దారు సురేష్ నాయక్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్, పిడిఎం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, ఏడుకొండల నాయక్, బికారి నాయక్, శంకర్ నాయక్, వెంకట్రావు, అంజలి భాయ్, వేముల లక్ష్మి మాట్లాడుతూ. అక్రమార్కులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సర్వేనెంబర్ 229/3-8,197 తదితరుల నెంబర్లలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ వద్ద ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. దీనిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పేదవాళ్ళ పేరుతో ధనికులకు ఇచ్చారు. వాటిని రద్దుచేసి, వినుకొండ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీలకు ఆ ప్రాంతంలో పట్టాలు మంజూరు చేయాలని తాసిల్దారు ని కోరారు.(Story : జగనన్న కాలనీలో జరుగుతున్న అక్రమాలపై చర్య తీసుకోవాలి)