ఈ నెల 21న జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని
న్యూస్ తెలుగు /వినుకొండ : సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి 9వ తేదీన వరకు జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ ప్రధమ మహాసభలు ఈ నెల 21వ తేదీన వినుకొండ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు శివయ్య స్తూపం సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందని , ఈ మహాసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని తెలిపారు. రాష్ట్ర మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు పోరాటాలు రూపొందించుకొని ముందుకు సాగడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు షేక్ గౌస్, ఖాసిం, మరియబాబు, మనోహర్, అభిషేక్, యునూష, లాజర్, ఏఐవైఎఫ్ మాచర్ల ఏరియా కార్యదర్శి రంగ స్వామి తదితరులు పాల్గొన్నారు. (Story : ఈ నెల 21న జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయండి)