Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం

గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం

0

గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గాంధీ నగర్ 30 వ వార్డు నందు నివసిస్తున్న ఒంటరి మహిళ, కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఎస్.కె మంగమ్మ కు గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవరావు చేతుల మీదగా 45 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్ నాయకులు భక్తుల గోవిందరాజులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బోడపాటి రామారావు, సోమేపల్లి శ్రీనివాసరావు, గుత్త గోవిందయ్య, అశోక్ నాయక్, డేవిడ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మంగమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతుందని డయాలసిస్ చేయవలసి ఉందని, అలానే తమ వంతుగా త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈమెకు డయాలసిస్ రోగిగా గుర్తించి ఈమెకు పెన్షన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వారన్నారు. (Story : గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version