జర్నలిస్టుల కోరిక మేరకే అక్రిడేషన్లు విడుదలకు ప్రభుత్వం సన్నాహకాలు
న్యూస్‌తెలుగు/చింతూరు : జనవరి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి పార్థసారథి సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తీవ్రంగా కృషి చేస్తున్నారు జర్నలిస్టులతో మంత్రివర్యులు డైరెక్టర్ అధికారులు నిర్వహించిన సమావేశంలో మాదిరిగానే జర్నలిస్టులకు అనుకూలంగానే జీవో తీసుకువచ్చేందుకు సమాచార శాఖ అధికారులు కృషి చేస్తున్నారు అక్రిడేషన్లు
మరో మూడు నెలలు పొడిగిస్తున్నారు అంటూ తప్పుడు సమాచారం గందరగోళానికి తెర లేపింది.ముఖ్యంగా జర్నలిస్టులు అందరికీ మేలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో త్వరలోనే అక్రిడేషన్ లకు సంబంధించి నూతన జీవో విడుదల అవుతున్నట్టు సమాచారం ఇందులో మీడియా ఫ్రెండ్లీ గానే అక్రిడేషన్ల రూపకల్పన ఉన్నట్లు సమాచారం మొత్తానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పార్థసారథి డైరెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ల జీవో విడుదల కానుంది. (Story : జర్నలిస్టుల కోరిక మేరకే అక్రిడేషన్లు విడుదలకు ప్రభుత్వం సన్నాహకాలు)