Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి నుండి ప్రశంసలు పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

డిజిపి నుండి ప్రశంసలు పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

0

డిజిపి నుండి ప్రశంసలు పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లాలో ముగిసిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన జిల్లాగా పోలీసుశాఖ ద్వితియ స్థానం సాధించిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. లోక్ అదాలత్లో 5345 కేసులను పరిష్కరించుటలో క్రియాశీలకంగా పని చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, డిసిఆర్బి ఎస్ఐ కే.రాజేష్, నెల్లిమర్ల హెడ్ కానిస్టేబులు కే.సన్యాసి నాయుడు, 2వ పట్టణ కానిస్టేబులు ఐ.శ్రీనివాసరావు లను రాష్ట్ర డిజిపి శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, లోక్ అదాలత్లో పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను ముందుగా గుర్తించి, ఆయా కేసుల్లో ఫిర్యాదిదారులు,కక్షిదారుల మధ్య సమన్వయం సాధించేందుకు క్షేత్ర స్థాయిలో చక్కని ప్రణాళితో పని చేసామన్నారు. న్యాయస్థానాల విలువైన సమయాన్ని ఆదా చేయడంతోపాటు, స్వల్ప వివాదాలు, క్షణికావేశంపై నమోదైన కేసుల్లో ఇరు వర్గాలను డిసెంబరు 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ నందు ప్రవేశ పెట్టడంతో, న్యాయస్థానం ముందు హాజరై, ఇరువర్గాలు రాజీ పడినట్లుగా వెల్లడించడంతో 5345 కేసులను పరిష్కరించామన్నారు. వివిధ పోలీసు స్టేషనుల్లో ఎఫ్.ఐ.ఆర్.లుగా నమోదైన 1192 కేసులతో సహా, 4153 ఎన్ఫోర్సుమెంటు కేసులను (మొత్తం 5345 కేసుల పరిష్కరించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని, జిల్లాను అన్ని రంగాల్లోను ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మెగా లోక్ అదాలత్లో 17,138 కేసులు డిస్పోజ్ కాగా, వాటిలో జిల్లా పోలీసులు 5345 కేసులను డిస్పోజ్ చేసి, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ప్రధమ స్థానంలో కర్నూలు జిల్లా, తృతియ స్థానంలో కృష్ణా జిల్లాలు నిలిచాయి. ఈ కార్యక్రమంలో సిఐడి అధిషనల్ డిజి డా. రవిశంకర్ అయ్యాన్నార్, లా అండ్ ఆర్డర్ ఐజి శ్రీ సీహెచ్.శ్రీకాంత్, ఈగల్ ఐజి శ్రీ ఆకె రవికృష్ణ, రైల్వే మరియు స్పోర్ట్స్ ఐజిపి కే.వి.మోహనరావు పలువురు ఉన్నతాధికారులు, ఇతర జిల్లాల ఎస్పీలు, ఇతర పోసు అధికారులు పాల్గొన్నారు. (Story : డిజిపి నుండి ప్రశంసలు పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version