మాలల సింహగర్జనకు భారీగా తరలిరండి
మాలల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ లూథర్
న్యూస్ తెలుగు /వినుకొండ :ఎస్సీ వర్గీకరణకు వ్యతి రేకంగా ఈ నెల 15వ తారఖున గుంటూరు లోని హౌసింగ్ బోర్డు కాలని దగ్గరలో మాల సంఘాల జె ఏ సి ఆద్వర్యంలో మాలల మహా సభ జరుగ బోతుందుని సభకు అందరూ ఐకమత్యంతో కదలి వచ్చి, గుంటూరు జన సంద్రములో మునిగిపోవాలి అనీ మాలల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ లూధర్ పిలుపునిచ్చారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ వర్గీ కరణ వల్ల అత్యధికంగా నష్టపోయేది మాల, మాదిగ లు మాత్రమే అని, అంతేకాకుండా మాలల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపిన ఆయన, ఇకనైనా మేల్కొని జరుగుతున్న నష్టాన్ని అందరితో గొంతెత్తి వినిపించడానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆయన కోరారు. రా! కదలిరా !! వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించే సభలో ప్రతి ఒక్కరూ గొంతెత్తి వినిపించే మాటలు ఢిల్లీకి వినిపించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు. మనువాద పార్టీలు తను ప్రయత్నాలు మొదలు పెట్టాయి అని ,వాటిని ఎదిరించక పోతే నీ జాతి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని,. మన ఆత్మ గౌరవాన్ని కాపాడు కోవడానికి నీతో పది మందిని తీ సుకొని ఈ సభకు రావాలన్నారు. నీ గర్జన ఢిల్లీకి విన బడేలా 15 న జరిగే మహా సభను జయప్రదం చేయలన్నారు. నీకోసం జరిగే పోరాటంలో నీవు పాల్గొనక పోతే మనలో మనమే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని, ఇకనైనా మేల్కొని గర్జించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం ,బాలు ,మాణిక్య రావు , చిట్టి బాబు, పి. భూషణ్ , డి.భూషణ్ ,కొండలు, జంగా శ్రీను, ఆనంద్ , చిరంజీవి, సల్లూరి రాంబాబు, చిన్న బ్రహ్మం, చెరుకూరి కాశీరామారావు, రాయి గోపి, చెరుకూరి చరణ్, గంగుల విజయ్, యామర్తి పెద్ద భాగ్య రావు, వినుకొండనియోజకవర్గ మాల నాయకులు పాల్గొన్నారు. (Story ;మాలల సింహగర్జనకు భారీగా తరలిరండి )