అన్నదానం అనేది మన సమాజానికి శ్రేయస్సు
బిజెపి మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు.
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : అన్నదానం అనేది మన సమాజానికి శ్రేయస్సును కలిగించడమే కాకుండా మన మార్గదర్శకత్వానికి కూడా ప్రధానమైనదని బిజెపి కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమారి యాదవుల జన్మదిన పౌర్ణమి సందర్భంగా 300 మందికి పైగా గిర్రాజు నగేష్ బృందం ఏర్పాటు చేసిన నిరుపేదలకు భోజన పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, అన్నమాచార్య సేవ మండలి పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం పాల్గొని సామాజిక సేవలో భాగస్వామ్యం అవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతు, ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు సహాయం చేయడమే కాక, దాతృత్వాన్ని ప్రోత్సహించడం కూడా మన బాధ్యత” అని పేర్కొన్నారు. దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించడం సంతోషదాయకమని తెలిపారు. మంత్రి కార్యాలయ సిబ్బంది, మా మంత్రి స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింతగా చేయాలని సంకల్పించాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు గిర్రాజు నగేష్, జింక రామాంజనేయులు, జింకా చంద్ర, సాకే ఓబ్లేష్, డోలా రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story : అన్నదానం అనేది మన సమాజానికి శ్రేయస్సు)