ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది..
కళాశాల డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి. కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఆ వృత్తికి అన్ని విధాల న్యాయం చేకూర్చే వారే నిజమైన ఉపాధ్యాయుడవుతాడని డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి,కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు-శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. అధ్యాపకులు విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు అనునిత్యం నిత్య విద్యార్థిగా ఉంటాడని, శిష్యుల యొక్క మనసుతో ప్రకారం తన బోధనను బోధించగలుగుతాడని తెలిపారు. అటువంటి మనస్తత్వాన్ని ప్రతి అధ్యాపకులు అలవర్చుకోవాలని తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో సమాజానికి, దేశానికి, ఉపయోగపడేలా తీర్చిదిద్దు వాడే ఉపాధ్యాయుడు అని తెలిపారు. కావున ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరు గౌరవించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్, అధ్యాపకులు, బోధ నేతల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది..)