దళిత యువకుడిని హత్య చేసిన నిందుతులని తక్షణమే అరెస్ట్ చేయాలి బి ఎస్ పి డిమాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యపురం మండలం శానంపూడి మాదిగ పల్లెకు చెందిన దళిత యువకుడు అమృతపూడి నాగేశ్వరరావు(34) గత నెల 7వ తేదీ కారుమంచి గ్రామంలో దారుణంగా హత్య చేసి, శవాన్ని అద్దంకి బ్రాంచ్ కెనాల్లో పడవేసిన ప్రధాన నిందితుడైన దావులూరి బ్రాహ్మయ్య (ఏనుగుపాలెం )మరియు అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని, ఈ హత్య సంఘటన పై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని, బహుజన సమాజ్ పార్టీ శనివారం స్థానిక పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు మాసిపోగు ఎసోబు, వేల్పుల రాంబాబు, ఏనుబరి వరప్రసాద్, వల్లెపు రమేష్, మందా సురేష్ బాబు, అమృతపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : దళిత యువకుడిని హత్య చేసిన నిందుతులని తక్షణమే అరెస్ట్ చేయాలి బి ఎస్ పి డిమాండ్)