132 వ ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే
కేసనపల్లి సుబ్బారావు ను సన్మానించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణానికి చెందిన చాయ చిత్రకారుడు కేసానపల్లి సుబ్బారావు తీసిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఎఫ్. ఐ. సి. ఎస్ పురస్కారం ను సంబంధించి 29 న ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే దినోత్సవం సందర్బంగా సన్మానించారు ది. ఇమేజ్ కొలీగ్ సొసైటి యు. ఎస్. ఏ వారి ఫెలో ఐ. సి. ఎస్.( ఎఫ్. ఐ. సి. ఎస్) ఆగస్టు 19 న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కేసానుపల్లి సుబ్బారావు ఈ పురస్కారమును అందుకున్నారు.
ఈ పిక్టోరియల్ డే రోజు ను ప్రపంచ దేశాలలో తో పాటు ఇండియా లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగడం చారిత్రక వేదిక అని తెలియజేశారు. ఫోటోగ్రఫీ లో నిష్ణాతులు గా కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ ను సన్మానించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఫోటో కంప్టేషన్ లో గెలుపొందిన ఫోటోగ్రాఫర్స్ ను సన్మానించారు. ఆంధ్ర హైర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు ,,కేసనపల్లి సుబ్బారావు కు ఇండియా ఎఫ్. ఐ. సి. ఎస్ గోల్డ్ మెడల్, షీల్డ్ ను అందించారు. ఈ కార్యక్రమాల్లో జర్నలిజం అండ్ మాస్ కమిని కేషన్ ప్రిన్సిపాల్ మధు,ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సురేష్,పీజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావును వినుకొండ జర్నలిస్టులు మరియు ఫోటోగ్రాఫర్లు, వంగపల్లి బ్రహ్మయ్య ,యార్లగడ్డ లెనిన్ కుమార్ , శ్యామ్, శ్రీకాంత్, కృష్ణ ప్రసాద్ ( కెపి ), సిపి , సతీష్ , గురుబ్రహ్మం, వెంకట్రావు, వెంకటేష్,మల్లిఖార్జునరావు,శ్రీనివాసరావు,నాగేశ్వరావు,మోహన్,గోపి తదితరులు అభినందించారు. (Story : 132 వ ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే )