రైతులందరూ ఈ కేవైసీ తప్పక నమోదు చేసుకోవాలి
వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రైతులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ మండల అధికారి ముస్తఫా తోపాటు కునుతూరు, పోతుకుంట గ్రామాలలో పంట నమోదు చేసుకున్న రైతులకు ఈకేవైసీ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రైతు సేవ కేంద్రం సిబ్బంది అందరూ కూడా రైతులందరికీ ఈకేవైసీ ఈనెల 23వ తేదీ గడువులోపు పూర్తి చేయాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కరుణాకర్, శ్రీనాథ్, రైతులు పాల్గొన్నారు. (Story : రైతులందరూ ఈ కేవైసీ తప్పక నమోదు చేసుకోవాలి)