పెండింగ్ జీతాలు చెల్లించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నవంబర్ 18 సోమవారం రోజు వనపర్తి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి. ఏవో భాను ప్రకాష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల గ్రామాలకు మూడు నాలుగు నెలల నుండి జీతాలు బకాయిలు ఉన్నాయని. పండుగకు కూడా జీతాలు రా లేదు అని ప్రశ్నించారు. ఇచ్చే జీతాలు తక్కువ అని పైగా నెలల తరబడి జీతాలు బకాయి ఉండడంతో కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దసరా లోపల జీతాలు చెల్లించాలని. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని. బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులు చేస్తూ గ్రామాలను పరిశుభ్రతకు పచ్చదనానికి నిలయంగా నిలుపుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకపోవడం దారుణమని. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పని భారం తగ్గించాలని వేధింపులు ఆపాలని. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.. జీవో నెంబర్ 51 సవరించాలని. వారంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని. పిఎఫ్ ఇఎఫ్సి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో . సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నీక్సన్ నాయకులు. నందిమల్ల . రాములు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా జిల్లా కోశాధికారి పుష్ప శీను దాసు రామచంద్రయ్య గంగా నరసింహ భద్రయ్య జమ్ములు సుగ్రీవుడు తదితరులు పాల్గొన్నారు