ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం లోని తాడిపర్తి, బుద్ధారం, చాకలి పల్లి గ్రామాలలో సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ,ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం గా ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఇప్పటివరకు 18 వేల కోట్ల రూపాయలు చేసిందని త్వరలోనే మిగతా 12 వేల కోట్ల రూపాయలను పంట రుణమాఫీ కోసం ఖర్చు చేసి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని రైతు భరోసా పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన ₹7500 నిధులు కూడా ఈ నెలలో ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేస్తుందని ఆయన వెల్లడించారు, అంతేకాక రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు వరి ధాన్యం సన్న వరి ధాన్యం పై క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని గ్రామాలలో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఎక్కడ చూసినా రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ తమ పండించిన పంటను తరలిస్తున్నారని అన్నారు, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం డబ్బులను రైతులు అకౌంట్లో వెంటనే వేస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు, అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకు వస్తున్న వరి ధాన్యంతో పాటు వేరుశనగ పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం ఎక్కడ కూడా జాప్యం చేయకుండా కొనుగోలు జరుగుతుందని పేర్కొన్నారు, మార్కెట్ యార్డులో రైతులకు ఇతర వసతులతో పాటు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్య శిలా రెడ్డి, డిఆర్డిఏ అధికారి అరుణ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, (Story : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చిన్నారెడ్డి)