పాత ఇంటి గోడ కూలి వ్యక్తి మృతి
న్యూస్ తెలుగు/సాలూరు : పాత ఇంటి గోడ కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన సాలూరు పట్టణంలో జరిగింది. శనివారం సుమారు 12.45 గంటలకు బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు 40 సంవత్సరాలు నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొనగా, ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు ఇంటి గోడ నల్ల శంకర్రావు పై పడగా గోడ కూలడం వల్ల సంఘటన స్థలంలోనే మరణించడం జరిగింది. సంఘటిన ప్రదేశంకు పట్టణ సి ఐ అప్పలనాయుడు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Story : పాత ఇంటి గోడ కూలి వ్యక్తి మృతి)