సీతం కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిదిలో గల సీతం కళాశాలలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిపారు. విద్యార్థులుకి గ్రంథాలయల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, పుస్తక పఠణం ద్వారా జ్ఞానాన్ని పెంపొదించుకోవచ్చని తెలియచేసారు.కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల కు, ఉపాధ్యాయులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేత లకు పుస్తకాలు ను బహుమతులు గా అందచేశారు.భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ పండిత జవహర్లలాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకొని అతనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, బాలల పై ఉన్న మక్కువ ను విద్యార్థులకి తెలియచేసి, చాకలేట్స్ ను పంచిపెట్టారు.ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కె సోమశేఖర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రంధాలయ ప్రాముఖ్యత, నేటి యువత భాద్యతలు మరియు వారికీ గ్రంధాలయం పట్ల అవగాహన ను వివరంగా తెలియచేసారు.కళాశాల డైరెక్టర్ డాక్టర్ యమ్. శశిభూషణరావు మాట్లాడుతూ గ్రంధాలయ పుస్తక పఠనం వలన జ్ఞాపకశక్తి పెరగడం తో పాటు మానవ అభివృద్ధికి, మేథో సంపత్తికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి వి రామమూర్తి, గ్రంధాలయ అధికారిని డాక్టర్ సత్యవతి, వివిధ విభాగదీపతులు, అధ్యాపకులు, గ్రంధాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story:సీతం కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ జయంతి వేడుకలు)