గీతాంజలి స్కూల్స్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకల
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాచా నెహ్రూ పిల్లలు అంటే ఎంతో ఇష్టమని ఆయన పిల్లలను ఎంతోగానో ప్రేమించే వారిని ఎక్కువ సమయం వారితో గడపడానికి ఇష్టపడే వారని పిల్లలు కూడా ఆయనని ఎంతగానో ఇష్టపడేవారు అని దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. పిల్లలందరూ మంచి నడవడికతో మంచి విద్యాబుద్ధులతో భావి భారత పౌరులుగా ఎదిగి తల్లిదండ్రులకు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చేసిన ప్రదర్శనలు చూపరులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story:గీతాంజలి స్కూల్స్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకల)