నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో మృతుడు గొల్ల ఇంద్ర తేజ తన కళ్ళను ఇచ్చి మానవతను చాటుకున్నాడని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పొట్టిపాడు గ్రామానికి చెందిన గొల్ల ఇంద్రతేజ (17 సం) తండ్రి నరసింహులు ఈనెల 10వ తేదీన మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వ దీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ , హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్ అనంతపురం సర్వజన ఆసుపత్రి నందు నేత్రాలను సేకరించడం జరిగింది అని తెలిపారు. నేత్రదానానికి సహకరించిన దాత తల్లితండ్రులు గొల్ల నరసింహులు తల్లి ఆదిలక్ష్మి గారికి విశ్వదీప సేవా వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం మాజీ అధ్యక్షులు బిల్లు నాగరాజు ,సురేష్,లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రఘు , తదితర సభ్యులు పాల్గొన్నారు (Story : నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు )