ఆధునిక విద్యా వ్యవస్థకు బాటలు వేసిన
మహనీయుడు అజాద్
కర్రస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ విద్యావ్యవస్థను సమూలంగా మార్చటానికి అడుగులు వేసిన తొలి వ్యక్తి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి,ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు భారతరత్న డా|| మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలను విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలు గా విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన కామర్స్ విభాగాధిపతి కృష్ణయ్యను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్ గారి జన్మదినమైన నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారని, అబుల్ కలాం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషిచేశారని, దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారని,ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే యుజిసి, ఐసీసీఆర్, ఏఐసిటియు, సి ఐ ఎన్ ఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. (Story : ఆధునిక విద్యా వ్యవస్థకు బాటలు వేసిన మహనీయుడు అజాద్)