కష్టం ఏదైనా పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన
జీవీ దంపతులు, మక్కెన…
న్యూస్‌తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో అనుకోని ఆపదల్లో పడిన పేదలకు కష్టం ఏదైనా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 5 నెలల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్‌ను తిరిగి పేదల పాలిట సంజీవని, ఆపద్భాంధవుడిగా మార్చాయని కొనియాడారు. మరణం అంచున నిలిచిన వారి ప్రాణాలు నిలపడం మొదలు అనేక విధాలుగా కుటుబాలను నిలబెడుతూ సీఎం పెద్దమనసును చాటుకుంటున్నారని తెలిపారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్సకోసం సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు రూ.13,30,679 విలువ గల చెక్కులు అందజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ, లీలావతి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికి మంజూరు పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆపద సమయంలో అత్యవసర అప్పుల కారణంగా నిస్సహాయ పరిస్థితుల్లో పడ్డవారికి, అప్పులు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. సీఎం సహాయ నిధి అంటేనే మానవత్వంతో, ఉదారంగా అందించే సాయమని, తద్వారా పేద, మధ్య తరగతి ప్రజల వైద్య చికిత్సకు చేయూతనిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులో సీఎం సహాయ నిధి ద్వారా 50% వరకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించలేదని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రమే నిరుపేదలకు అండగా నిలిచి ఆదుకుంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా గడిచిన వైకాపా ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, కొన్నిసార్లు ఇచ్చిన చెక్కులు కూడా చెల్లని దుస్థితి నెలకొన్న ఉదంతాలున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రం గతంలో అయినా, ఇప్పుడైనా సీఎం చంద్రబాబు చేతికి ఎముకే లేదన్న చందంగా కష్టంలో ఉన్నవారు అడిగిందే తడవుగా సాయం అందిస్తున్నారని అన్నారు. ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలకైతే ఇది ప్రాణ దాతగానే మారిందన్నారు. (Story : కష్టం ఏదైనా పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి)