హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం
రైతుల కష్టాలలో పాలుపంచుకుందాం
రావుల చంద్రశేఖరరెడ్డి
న్యూస్తెలుగు/వనపర్తి : అక్టోబర్ 29న తలపెట్టిన రైతాంగ ప్రజా నిరసన సదస్సు విజయవంతం చేయాలని రావుల చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంజన్ రెడ్డి అనుక్షణం నాయకుల, కార్యకర్తల,ప్రజల కష్టుఖాలలో పాలుపంచుకొంటున్నారాని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రెక్కల కష్టంపై అధికారంలోకి వచ్చి వారికి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి వారిని హరిగోస పెడుతుందని అందుకోసమే రైతులకు సమగ్ర రుణ మాఫీ చేయాలని. రైతు భరోసా ఏటా 15000ఇవ్వాలని రైతు భీమా అమలు చేయాలని మహిళలకు,యువకులకు,వృద్దులకు,నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని నిరంజన్ రెడ్డి నాయకత్వములో తలపెట్టిన రైతాంగ ప్రజా నిరసన సదస్సు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. (Story : హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం)