భవిష్యత్తు తరాలకోసం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వములో పని చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ భవన్ ఇన్చార్జి రావుల.చంద్రశేఖర్ రెడ్డి ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు పుట్ట.బాలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులుగా వనపర్తినీ నేను మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగాన నిలిపామని అది గుర్తించిన నిరంజన్ రెడ్డి భవిష్యత్తు తరాలకోసం అనేక అభివృద్ధి పనులు కరోనాను మినహాయించి 3ఎండ్లలో అనితరసాధ్యమైన అభివృద్ధి చేసి చూపారని ఒక విజన్ కలిగిన వ్యక్తిని కోల్పోవడం వనపర్తి ప్రజల దురదృష్టం అని అన్నారు. ఏదిఏమైనా రాబోవు కాలంలో నిరంజన్ రెడ్డి నాయకత్వములో గులాబి జండా రెపరెపలాడాలని అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ ఉద్యమస్పూర్తి నిరంజన్ రెడ్డి గారిని మరోసారి శాసనసభ్యునిగా ఎన్నుకొని భావితరాలకు భవిష్యత్తు కోసం బాటలు వేద్దామని అన్నారు. (Story :భవిష్యత్తు తరాలకోసం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వములో పని చేయాలి)