పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి
జిల్లా ఎస్పీ డా.శబరీష్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎన్నటికీ మరవలేనివి అని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. సోమవారం
ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ విచ్చేసి విధులలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్థూపానికి పూల మాలల ద్వారా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధులలో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎప్పటికీ మన హృదయంలో నిలిచిపోతారని, వారి త్యాగాలు మరువలేనివని , మనందరం వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలబడాలని పోలీస్ శాఖ తరఫున వారి సమస్యలు తీర్చడంలో ముందుంటానని తెలియచేసారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కూడా జిల్లా పోలీసులు ధైర్యంగా పనిచేస్తున్నారని, తమ ఉద్యోగ విధులలో ఎలాంటి ఒత్తిడి వచ్చిన ఎంత కఠినమైన పరిస్థితులు నెలకొన్న, ఏ మాత్రం భయభ్రాంతులకు లోను కాకుండా, జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని, వరదల సమయంలో ప్రజలను సంరక్షించడంలో భాగంగా ప్రాణాలకు తెగించి అహర్నిశలు శ్రమించారన్నారు.శాంతిభద్రతలు కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్నారని, ప్రతిరోజు పోలీసులు చేస్తున్న సేవల వల్లనే సమాజంలో న్యాయం, సురక్ష స్థాపించబడుతున్నదని, ఒకే లక్ష్యం కోసం మనందరం కలిసి పని చేయాలని మన పోలీస్ శాఖ సమాజానికి దేశానికి సేవ చేయడం అత్యంత ప్రధానమైనదని దేశ భవిష్యత్తు కోసం మరింతగా కలిసి పని చేయాలని మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
క అనంతరం అమరవీరుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేసి వారి సమస్యల పట్ల చర్చించి వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం డి.ఎస్.పి రాములు, ములుగు డి.ఎస్.పి రవీందర్ ఏటూరునాగారం సిఐ శ్రీనివాస్ వెంకటాపురం సి ఐ కుమార్,సీఐ షేక్ మస్తాన్ ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఏటూరునాగారం ఎస్ఐ తాజుద్దీన్ మంగపేట ఎస్సై టీవీ సూరి ,వాజేడు ఎస్సై హరీష్ ఆర్ఎస్ఐ గోపీచంద్ ఆర్ఎస్ఐ నిర్మల ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి)