ధిమ్సా వార్తా పత్రికను ఆవిష్కరించిన ప్రొఫెసర్ టి.వి. కట్టిమని
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తన అధికారిక వార్తా పత్రిక ధిమ్సా’ యొక్క తొలి సంచికను విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ టి.వి. కట్టిమని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధిమ్సా యూనివర్శిటీ విజయం, విద్యార్థుల ప్రగతి, సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిపే ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ‘ధిమ్సా’ యూనివర్శిటీ ముఖ్య విజయాలు, క్యాంపస్‌లో జరిగిన ప్రధాన సంఘటనలు, విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతాల్లోని గిరిజన సంస్కృతి ప్రతిబింబాలను ప్రదర్శిస్తుందని, యూనివర్శిటీ సముదాయాన్ని కలిపే వేదికగా నిలుస్తుందని తెలిపారు. క్యాంపస్‌లోని ప్రతి ఒక్కరిని కలుపుతూ, సంచార సమాచారానికి శక్తివంతమైన సాధనంగా సేవలు అందించనుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసన్, సివోయి ప్రొఫెసర్ కివడే, డీన్లు ప్రొఫెసర్ శరత్చంద్ర బాబు, ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తా పత్రిక యూనివర్శిటీ అభివృద్ధికి ప్రతిబింబంగా నిలుస్తుందని అందరూ అభినందించారు. (Story ధిమ్సా వార్తా పత్రికను ఆవిష్కరించిన ప్రొఫెసర్ టి.వి. కట్టిమని)