రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
బిఆర్ఎస్ డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు డిసెంబర్9 నాటికి 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రుణ మాఫీ కోసం 30వేల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి క్యాబినేట్లో 27వేల కోట్లు మంజూరు అని కేవలం 17వేల కోట్లు ఇచ్చి రైతులను దగా చేయడం గాక డిసెంబర్9 తర్వాత రైతు భరోసా క్రింద యాసంగిలో ఒక్క ఏకరాన్నికి 7500 వానకాలానికి 7500 చొప్పున సీజన్ కు 9000వేల కోట్లు ఇస్తామని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.నాగేశ్వర్ రావు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమే అని దుయ్యబట్టారు. కౌలు రైతులకు,రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని మోసం చేసి గద్దెనెక్కిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని రైతు భరోసా ఇవ్వలేని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చి జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే కాంగ్రెస్ హామీలు ఆసరా ఫించన్,కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం,మహిళలకు 2500 మొదలగు హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,నాగన్న యాదవ్, ఉంగ్లమ్. తిరుమల్, జాత్రునాయక్ ,డేవర్ల.నరసింహ, జో హే బ్ హుస్సేన్,ప్యాటా.తిరుపతయ్య,చిలుక.సత్యం, మహేశ్వర్ రెడ్డి,సయ్యద్.జమేళ్,శాంతన్న సాగర్, చీర్ల.శ్రీనివాసులు, జానంపేట.శ్రీను,సూర్యవంశపు.గిరి,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము,వహీద్,బాలకృష్ణ,వజ్రాల.రమేష్,కవితానాయక్,బెంగాలీ.రఘు,ఖాడర్శా,అయ్యూబ్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story :రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి )