Home వార్తలు తెలంగాణ మీడియా ముసుగులో మూగజీవాలు..ఇసుక అక్రమ త‌రలింపు 

మీడియా ముసుగులో మూగజీవాలు..ఇసుక అక్రమ త‌రలింపు 

0

మీడియా ముసుగులో మూగజీవాలు..ఇసుక అక్రమ త‌రలింపు 

రవాణా చేస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు.ఎస్ఐ.

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : మీడియా చాటున ఎలాంటి అనుమతులు,లేకుండా మూగ జీవాలను అక్రమంగా తరలిస్తున్న ఐదు గురి పై కేసు నమోదు చేసి డీసీఎం. కారు సీజ్ చేయడం జరిగిందని, ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు.ఎస్ ఐ తెలిపిన వివరాలు ప్రకారం, శుక్రవారం వారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎస్కార్ట్ వాహనంగా కారు, అతివేగంగా వస్తుండడం, దాని వెనకాల డీసీఎం వాహనం అతివేగంగా, ఒకదాని వెనుక ఒకటి రావడంతో వాహనాలను ఆపి తనిఖీ చేయగా, అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్న ఐదు గురు వ్యక్తులను అదుపులో తీసుకోని కేసు నమోదు చేశామన్నారు.1) చిన్న బోయిన్నపల్లికి చెందిన కన్నబోయిన శీను తండ్రి కొమరయ్య వయస్సు 35 సంవత్సరాలు కులం యాదవ్. వృత్తి రిపోర్టర్. సెల్ షాప్ నిర్వహణ చేస్తూ గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా మూగ జీవాల అక్రమ రవాణాకు పాల్పడుతూన్నాడని, వాహనాలలో రాత్రిపూట, మూగ జీవాలను తరలిస్తున్న క్రమంలో తన కారును ఎస్కార్ట్ వాహనంగా ముందు వెళ్తూ వాహనాలు దాటిస్తూన్నారు.7
2. )కమలాపురం గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా కు చెందిన ఆత్కూరి రవీందర్ తండ్రి చిన్ని. వయస్సు 29, సంవత్సరాలు.,కులం ఎస్సీ మాదిగ. వృత్తి డ్రైవర్,
3) దొడ్ల కొత్తూరు, గ్రామం, ఏటూరునాగారం మండలంకు చెందిన జైస్లావత్ కుమార్ తండ్రి వస్త్రమ్ వయస్సు 24 సంవత్సరాలు కులం లంబాడ,వృత్తి డ్రైవింగ్ ,
4) జంగాలపల్లిగ్రామం,ములుగు మండలంకు చెందిన కొడాలి కృష్ణ తండ్రి సారయ్య వయస్సు 34 సంవత్సరాలు,కులం ఎస్సీ మాదిగ,గ్రామం వృత్తి కూలి,
5) ఉచిత శ్రీను తండ్రి కొమరయ్య,వయస్సు 22 సంవత్సరాలు కులం యాదవ్ వృత్తి డిగ్రీ విద్యార్థి
పైన పేర్కొన్న వ్యక్తులు ముందు ఎస్కార్ట్ వాహనం నెంబర్ AP 16CA 3656 గలకారులో వెనుక డీసీఎం వాహనం TS 12VT 4046 గల వాహనంలో 22 మూగజీవాలనుఅక్రమoగా తరలిస్తున్న విరి పై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.ఎస్ ఐ.

అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చూస్తూ ఊరుకునేది లేదని,చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు,ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు. ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి, మూగజీవాలు, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలపై నిత్యం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని,వాహనాల తనిఖీలు చేపడుతున్నామన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలతొ పాటు,
ఏటూరునాగారం మండలంలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శబరీష్, నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. చీకటి మాటున రాత్రులు, కొంతమంది వ్యక్తులు, అక్రమ సంపాదనకు అలవాటు పడి,యూనిఫామ్ ధరించి, ఇసుక లారీల వద్ద నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు,తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే,చూస్తూ ఊరుకునేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాత్రిపూట సంచరిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తమకు తెలియదని అపోహలో ఉన్నారని సీసీ కెమెరాలు నిఘా నేత్రాల ద్వారా నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.
జల్సాలకు అక్రమ సంపాదనకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : మీడియా ముసుగులో మూగజీవాలు..ఇసుక అక్రమ త‌రలింపు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version