విశ్వహిందూ మహాసంఘ్ భారత్ ఆధ్వర్యంలో హైందవ ధర్మ భజన మండలి సమ్మేళనం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం హిందూ బంధువులందరికీ ఆహ్వానం మన వినుకొండ పాత మార్కెట్ బజారు నందుగల శ్రీ శంకరమఠం నందు ఈరోజు అనగా ది.18 అక్టోబర్ 2024న శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు విశ్వహిందూ మహాసంఘ్ భారత్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ సంబంధిత విషయాలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో విశ్వహిందూ మహా సంఘం భారత్ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వినుకొండ పట్టణ పురోహితులు పురోహిత సామ్రాట్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మను, పల్నాడు జిల్లా అధ్యక్షులుగా శ్రీ భాగవతుల రవికుమార్ ను పల్నాడు జిల్లా కార్యదర్శిగా శ్రీ గజవల్లి నాగ పవన్ ను, పల్నాడు జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలిగా శ్రీమతి తెలగంశెట్టి పావనీని, వినుకొండ నియోజకవర్గం మహిళా విభాగ అధ్యక్షురాలుగా శ్రీమతి మాలేపాటి సునీతను, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులుగా శ్రీ భవనాసి సాంబశివరావును, జిల్లా భజన మండలి అధ్యక్షులుగా శ్రీ పారేళ్ల ప్రసాదును, వినుకొండ పట్టణ అధ్యక్షులుగా శ్రీ కంచర్ల వీరభద్రాచారిని, శావల్యాపురం మండలాధ్యక్షులు శ్రీ తెల్లగడ్డ హనుమంతరావులని నియమించి వీరికి నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈనెల 30వ తేదిన అనగా ది. 30/10/2024 న బుధవారం నాడు వినుకొండ బోసుబొమ్మ సెంటర్ నందు గల శ్రీ వాసవీ కళ్యాణ మండపం నందు సనాతన ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు పల్నాడు జిల్లాస్థాయి హైందవ ధర్మ భజన మండలి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో హిందూధర్మ పరిరక్షకులైన స్వామీజీలు, సత్సంగాల వాళ్ళు, భజన మండలీలు, కోలాట మండలీలు, ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్, అర్చక పురోహిత సంఘాలు వంటి సనాతన ధర్మ పరిరక్షణ సమితులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని వారికి అందరికీ కూడా ఆహ్వానాలు అందజేస్తామని సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు గారు తెలియజేశారు. (Story : విశ్వహిందూ మహాసంఘ్ భారత్ ఆధ్వర్యంలో హైందవ ధర్మ భజన మండలి సమ్మేళనం)