Home వార్తలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విద్య

గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విద్య

0

గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విద్య

మంత్రి సీతక్క

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో డిజిటల్ విద్యను అందించేందుకు ముందుకు వచ్చిన, కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎన్జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్ కి,రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక అభినందనలు తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశం అయినందుకు సంతోషంగా ఉందని, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.సారం లేని భూమి, విద్య లేని జీవితం ఒక్కటే, అందుకే విద్య అనేది చాలా ముఖ్యం అన్నారు. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే, సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయన్నారు. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని, మైధనా ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. విద్య పై పలు అంశాలు మంత్రి మాట్లాడారు.అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి,ప్రముఖ ఎన్జీఓ, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విద్య)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version