మునిసిపల్ కమీషనర్ వాటర్ పంప్ హౌస్ ఆకస్మిక తనిఖీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టన ప్రజలకు పరిశుద్ధమైన తాగటానికి యోగ్యమైన మంచినీటిని ఇచ్చేందుకు ఎమెల్యే జి వి ఆంజనేయులు ఆదేశాల మేరకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ పంప్ హౌస్ నిర్వహణ నీటి నాణ్యతను, నీటి స్వచ్ఛతను తెలిపే నీటి పరీక్షల తీరుతెన్ను బ్లీచింగ్ వాడకం ఆలం మోతాదు పంపింగ్ మోటార్స్, పైపులైన్స్ వాల్వ్స్ కరెంటు సప్లై రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ మొదలగు అన్ని అంశాలు మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ గురువారం పరిశీలించి సమీక్షించారు. దెబ్బతిన్న పైప్‌లైన్‌లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని, రికార్డ్ నిర్వహణ పారదర్శకంగా ఉండేలాగా డిజిటలైజ్ చేయాలని, అనధికార ప్రాప్యతను నిరోధించడానికి భద్రతా చర్యలను మెరుగుపరచాలని సూచించారు. పట్టణ ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వృథాగా కాలువలలోకి రోడ్ల మీదకు వదలరాదని, కొళాయిలకు డమ్మీ మూతలు ఏర్పాటుచేసుకుని నీటిని ఆదా ఆదా చేసుకోవాలని కోరారు. (Story : మునిసిపల్ కమీషనర్ వాటర్ పంప్ హౌస్ ఆకస్మిక తనిఖీ)