ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదవ రోజు గురువారం ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వినుకొండ నందు జరిగిన కార్యక్రమములు.
ఉదయము 108 జల కలశములతో మహిళల ఉత్సవం , జగద్గురు పీఠం వినుకొండ వారిచే వేద పఠనం, వెయ్యి మంది మహిళలచే లక్ష కుంకుమార్చనలు, దంపతులచే మహన్యాస పూజ, ఏకాదశి రుద్రాభిషేకములు, కుంకుమ పూజలు, సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ మహాగణపతి మహా చండీ హోమములు దంపతులచే నిర్వహించారు, రాత్రి 8 గంటలకు విశేషంగా అమ్మవారికి ఉయ్యాల సేవ ఆర్య వైశ్యుల అన్ని గోత్రీకులతో నిర్వహించారు. రాత్రి 10 గంటలకు అమ్మవారికి నవ హారతులు హోమంలో కూర్చున్న దంపతులకు వేద ఆశీర్వచనం శేష వస్త్రము తదుపరి తీర్థప్రసాద వినియోగం. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహించినది. కార్యక్రమాలు అన్ని వినుకొండ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు పాడిపంటలతో, అష్టైశ్వర్యములతో, పిల్లాపాపలతో తులతూగవలెనని ఆకాంక్షిస్తూ ఆర్యవైశ్య సదావర్తి సంఘ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలు తో నిర్వహించారు. కావున ప్రజలందరూ శ్రీ వాసవి కనుక పరమేశ్వరి అమ్మవారిని దర్శించి సేవించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కొరకు పాత్రలు కావలసినదిగా కోరారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వినుకొండ
పాలకమండలి సభ్యులు మిత్తింటి కృష్ణ ఆంజనేయులు, నేరెళ్ల వెంకట పాపారావు, పెనుగొండ రమేష్, పెండేలా శ్రీనివాసరావు, కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు, కోట వెంకట ప్రకాష్ బాబు పాల్గొన్నారు. (Story :ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు)