వినుకొండ నుండి రాష్ట్రస్థాయి స్కేటింగ్ కు నలుగురు విద్యార్థులు ఎంపిక
న్యూస్‌తెలుగు/ వినుకొండ :
స్థానిక కారంపూడి రోడ్డు నందు గల చాణిక్య స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమావేశం నందు కోచ్ శర్మ మాట్లాడుతూ స్కేటింగ్ క్రీడ విభాగంలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు మా చాణిక్య అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఈనెల 7,8 తేదీల మంగళగిరి లో జరిగిన జిల్లా స్థాయి స్కెటింగ్ పోటీలలో తమ అకాడమీ చాణిక్య నుండి మొత్తం 8మంది హాజరు కాగా అందులో నలుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. క్రీడల్లో గెలుపొందిన గోల్డ్ ,సిలవర్ ఏడూ బ్రంజ్ లు సాధించారు . వచ్చే నెల కాకినాడలో జరగబోయే రాష్ట్ర సాయి స్కేటింగ్ క్రీడా పోటీల్లో గెలుపొందిన ఈ నలుగురు పాల్గొంటారని వివరించారు. తమ అకాడమీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇటువంటి విజయాలు పొందడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని, క్రీడల్లో గెలుపొందిన తనీష్, మహమ్మద్, వసీ, పవన్, వెంకట్ రెడ్డి,లను వారి తల్లిదండ్రులను అకాడమీ వాళ్ళు తరఫున అభినందించరు. ఈ కార్యక్రమంలో చాణక్య స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ కంచర్ల నాగార్జున, ఎస్.కె. అబ్దుల్ భాష, ఎం. శర్మ తల్లిదండ్రులు రేలా. వెంకటరెడ్డి. జి. ఉమా, తోమాటి. కాశీరావు, దేవి, రాయుడు, తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. (Story : వినుకొండ నుండి రాష్ట్రస్థాయి స్కేటింగ్ కు నలుగురు విద్యార్థులు ఎంపిక)