UA-35385725-1 UA-35385725-1

హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం 6 మూవీ

హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం 6 మూవీ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: వరుస బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6ని నిర్మించనున్నారు. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

వెంకీ కుడుముల, కోన వెంకట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్‌ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ “హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం. 6 ఓపెనింగ్ కి వచ్చిన మీడియా మిత్రులకు థాంక్ యూ. ఈ ఆరో సినిమా ఒక మిరాకిల్ గా జరిగింది. సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్ లో ఇదే ఫస్ట్ . అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ వున్న సినిమా ఇది. సంయుక్త ఓకే అంటేనే ఈ సినిమా చేద్దామని అనుకున్నాను.కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాని చేయబోతున్నాం. మిగతా విషయాలన్ని టీజర్ లాంచ్ సందర్భంగా తెలియజేస్తాము’ అన్నారు

దర్శకుడు యోగేష్ కెఎంసి మాట్లాడుతూ – ”ఈ కథ, చిత్రానికి రాజేష్ దండా, సంయుక్త గారు కీలకం. కథ నచ్చి వెంటనే చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కథ ఎంతలా నచ్చిందని చెప్పడానికి ఉదాహరణ సంయుక్త గారు ఈ సినిమాని ప్రెజెంట్స్ చేస్తున్నారు.  సంయుక్త లాంటి గుడ్ పెర్ఫార్మర్ తోనే ఈ సినిమా చేయాలని రాజేష్ గారు నిశ్చయించుకున్నారు. ఇదంతా దైవ సంకల్పం. మిగతా విషయాలు టీజర్ లాంచ్ టైం లో చెప్తాము’ అన్నారు.

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ ”అందరికీ ధన్యవాదాలు. రాజేష్ గారు చెప్పినట్లు ఈ సినిమా ఒక మిరాకిల్ లానే జరిగింది. ఈ కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్ గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను, కథ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు కొన్ని ఇయర్స్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపార్మెంట్ సబ్జెక్ట్స్ వుంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ వున్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు. అంత మంచి కథ.

ప్రస్తుతం, నేను ఐదు చిత్రాలను షూట్ చేస్తున్నాను, ఈ కథ విన్నప్పుడు ఆడ్రినలిన్ రష్ అనిపించింది. కథ చాలా నచ్చింది. రాజేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ యోగేష్ గారు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్  చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు వున్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ మ్యాన్ పవర్, ఫిజికాలిటీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది కథ’ అన్నారు

దర్శకుడు యోగేష్ KMC ఒక పవర్ ఫుల్ కథను రాశారు, ఇది థ్రిల్లర్ జానర్‌లో కొత్త పాయింట్. దర్శకుడు సంయుక్తను డైనమిక్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కొన్ని బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని చేయబోతున్నారు.

ఈ చిత్రం అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

తారాగణం: సంయుక్త
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యోగేష్ KMC
నిర్మాత: రాజేష్ దండా
బ్యానర్స్: హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్
సమర్పణ: సంయుక్త
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Samyuktha’s Female Centric Action Thriller With Yogesh KMC, Razesh Danda, Hasya Movies, Maganti Pictures, Samyuktha Presents, Production No 6 Launched Grandly Today

Tollywood’s lucky charm Samyuktha who is part of several blockbusters is doing a female centric movie for the first time. Yogesh KMC will be directing the movie which will be produced by successful producer Razesh Danda who produced sensational hits like Samajavaragamana and Ooru Peru Bhairavakona. The production No 6 of Hasya Movies will be produced, in association with Maganti Pictures. Samyuktha also presents the movie which was launched grandly today with a pooja ceremony in Ramanaidu Studios in the presence of several special guests.

Venky Kudumula and Kona Venkat handed over the script to the makers to begin the proceedings. While Rana Daggubati sounded the clapboard on actress Samyuktha, Dil Raju switched on the camera. Directors Vassishta and Ram Abbaraju directed the first shot. The event was also attended by Suresh Babu, Gemini Kiran, Sahu Garapati, Chukkapalli Avinash, etc.

Producer Razesh Danda said, “I want to express my gratitude to the media for joining us today. A miracle has unfolded with our production No. 6. Samyuktha approved the script in a single sitting, and we held the opening the very next day. It’s an incredibly exciting script, and we were committed to making this movie only if Samyuktha approves it. This film is a commercial action thriller, and we’ll share more details during the teaser launch.”

Director Yogesh KMC said, “Razesh Danda and Samyuktha are integral to this story and film. Once the story was locked, their involvement became essential. I’m grateful to Samyuktha for her immediate acceptance of the role. Her enthusiasm is evident, as she is presenting the movie herself. Razesh was determined to work with a talented performer like Samyuktha. It truly feels like a blessing, and we’ll discuss more during the teaser launch.”

Samyuktha said, “Thanks to all. This movie feels like a miracle. A couple of months ago, while I was busy with shoots, I was invited to hear a script. I wanted to listen to it when I had a relaxed day. I finally heard the story couple of days ago, and it was spectacular. The attention to detail was incredible. I prefer not to label it a female-centric movie. It’s a compelling story with a strong female lead. I’m open to doing female-centric films, but I’ve often wondered why we can’t tell a normal story in a unique way. This narrative could easily accommodate a male protagonist as well. I owe much of my success in Telugu cinema to my manager, Karthik.

Currently, I’m shooting five films, but I felt an inner urge for a project that would give me an adrenaline rush. When I heard this script, I knew I had to say yes. I couldn’t resist. It felt like destiny to find such a project with a producer who believes in it. As I listened to the story, vivid scenes ran through my mind. I can’t wait to start this project. We have about 2-3 months before filming begins, and I’m eager for the preparations and production work ahead. From the biggest actors, I’ve learned that the script is everything for an actor. I feel overwhelmed to play this character on screen. There is so much of social and female politics in the script. When you want to bring down the negativity, you don’t always have to use the man power or physicality. There’s a woman way of bringing an entire thing down, in her own way. The story is about how she does it.”

Director Yogesh KMC penned a powerful story and it’s a new point in thriller genre. The director will be presenting Samyuktha in a dynamic character. The actress will be seen performing some breathtaking stunts in the movie.

This untitled movie will be mounted prestigiously on a high budget with top-notch technical and production standards. While Brahma Kadali is the art director, Chota K Prasad takes care of editing.

The film’s remaining cast and crew will be revealed later.

Cast: Samyuktha

Technical Crew:
Writer, Director: Yogesh KMC
Producer: Razesh Danda
Banners: Hasya Movies, Maganti Pictures
Presents: Samyuktha
Art: Brahma Kadali
Editor: Chota K Prasad
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media (Story : హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం 6 మూవీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1