Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కనువిందైనా అమ్మవారి అలంకరణ

కనువిందైనా అమ్మవారి అలంకరణ

0

కనువిందైనా అమ్మవారి అలంకరణ

న్యూస్ తెలుగు/వినుకొండ : బోసు బొమ్మ సెంటర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు శనివారం అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహిస్తున్నారు.
ఆలయంలో ఉదయం ఏడు గంటలకు 54 జల కలశములతో మహిళలచే నగరోత్సవం, తదుపరి జగద్గురు పీఠం వినుకొండ వారిచే వేద పఠనం, దంపతులచే మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు , మహిళలచే లక్ష కుంకుమార్చనలు, దంపతులచే కుంకుమ పూజలు, సాయంత్రం దంపతులచే మహాగణపతి నవగ్రహ మహా సుదర్శన శ్రీ రుద్ర సహిత మహా చండీ హోమములు, రాత్రి 8 గంటలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమములు భరతనాట్యము కోలాటం లెజిమ్స్ మిమిక్రీ షో బుర్రకథ సహస్ర దీపాలంకరణ పల్లకి సేవ ఉయ్యాల సేవ వంటి కార్యక్రమములు రోజుకు ఒకటి చొప్పున జరుగును, చివరి రోజు సెమీ పూజ పారువేట ఆర్యవైశ్య సంఘ సభ్యులచే నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి పైన తెలిపిన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము.
పట్టణ ఆర్యవైశ్య సంఘం వినుకొండ పాలక కమిటీ సభ్యులు మిత్తింటి కృష్ణ ఆంజనేయులు, నేరెళ్ల వెంకట పాపారావు, పెనుగొండ రమేష్, పెండేల శ్రీనివాసరావు, కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు, కోట వెంకట ప్రకాష్ బాబు పాల్గొన్నారు. (Story : కనువిందైనా అమ్మవారి అలంకరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version