అమలుకానీ హామీలిచ్చి ఆటో కార్మికుల ఓట్లు దండుకున్న రేవంత్
ఆటో కార్మికులకు అండదండగా నిలుస్తా
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం(బి.ఆర్.ఎస్.కె.వి)ఆటో యూనియన్ కార్మికులు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు.రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రతి కార్మికునికి సంవత్సరానికి 12000రూపాయలు అందిస్తానని,పిల్లల చదువుల కోసం ప్రత్యేక స్కీమ్ ల ద్వారా ఉన్నత విద్య కల్పిస్తామని,ఇండ్లు లేని కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు అని దుయ్యబట్టారు.ఇచ్చిన హామీలు నెరవేర్చేలేని ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టీ తమ బతుకులు బజారు పాలుజేసారని వాపోయారు.ఈ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితబోధ చేయాలని కోరారు.వినతి పత్రం సమర్పించిన అనంతరం గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారినీ కలసి తమకు ఆర్.టి.ఓ,పోలీస్,ఆర్.టి.సి అధికారుల నుండి వేధింపులు అధికమయినాయని మాకు సహకరించి అధికారులతో మాట్లాడ లని విజ్ఞప్తి చేయగా స్పందించిన మాజీ మంత్రి మీకు అండ దండగా ఉంటానని ప్రతి విషయములో ఖచ్చితంగా సహకరిస్తానని అధికారులతో మాట్లాడి మీకు ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు ప్రేమ్ నాథ్ రెడ్డి,కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచె.రవి,గంధం.పరంజ్యోతి, ఇమ్రాన్,సూర్యవంశపు.గిరి, చిట్యాల.రాము సునీల్ వాల్మీకి, ముద్దుసార్, ఆలీమ్మ్,రామస్వామి,తోట.శ్రీనుతో పాటు ఆటో యూనియన్ అధ్యక్షులు తాత రాములు,ప్రధాన కార్యదర్శి జంగిడీ.వెంకటయ్య ,యాదయ్య,అనిల్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.(Story : అమలుకానీ హామీలిచ్చి ఆటో కార్మికుల ఓట్లు దండుకున్న రేవంత్ )