Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులకునగదు బహుమతి

సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులకునగదు బహుమతి

0

సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులకునగదు బహుమతి

న్యూస్‌తెలుగు/విజయనగరం : సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో కోచ్ కె. సంతోష్ కుమార్ ఆధ్వర్యం లో కరాటే లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కె. శివ గణేష్ , పి. కుశ్వంత్ కుమార్,
బి. రేస్వంత్, పి. హేమంత్, ఎం. హర్ష వర్ధన్ లు ఈ నెల 27, 28 వ తారీఖులలో ఖరఘ్ పూర్, పశ్చిమ బెంగాల్ లో గీతాంజలి ఇండోర్ స్టేడియం లో ఖరగ్ పూర్ యువ కరాటే అకాడమీ కెన్యు రీయు కరాటే అసోసియేషన్, బెంగాల్ ఆధ్వర్యం లో జరగబోయే 24 వ జాతీయ జపాన్ కెన్యు రీయూ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ లో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా సత్య విద్యా సంస్థల సంచాలకులు. డాక్టర్ మజ్జి శశిభూషణరావు చేతుల మీదుగా ఈ విద్యార్థులకు 10,000/- రూపాయలు నగదును విద్యార్థులను ప్రోత్సహిస్తూ అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, లెఫ్టినెంట్ ఎం. ఉదయ్ కిరణ్, కరాటే కోచ్ కె. సంతోష్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులకునగదు బహుమతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version