కమ్యూనికేషన్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు
ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): చదువుతోపాటు ప్రతి విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎలాంటి రంగంలోనైనా ఉన్నత స్థితిలో నిలవగలుగుతారని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు బెంగళూరుకు చెందిన టెక్నో హబ్ సొల్యూషన్స్ కంపెనీ వారిచే కళాశాల విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ , ప్లేస్మెంట్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి ప్రోగ్రామింగ్ పైనే దృష్టి పెట్టకుండా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ పై దృష్టి పెట్టినప్పుడే తాము అనుకున్న ఉద్యోగాలను సాధించగలరని వారు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ కంపెనీ గ్రామీణ విద్యార్థులకు వివిధ టెక్నాలజీ ల నందు ట్రైనింగ్ ఇచ్చి వారు త్వరగా తాము కోరుకున్న ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో రమేష,అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. (Story : కమ్యూనికేషన్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు)