మహాత్మ గాంధీ విగ్రహంకుఘన నివాళులు : రఘు
న్యూస్ తెలుగు /ములుగు : జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా, ఏటూరునాగారం మండల కేంద్రంలోని, మహాత్మ గాంధీ విగ్రహం కు, స్థానిక కాంగ్రెస్ మండల కమిటి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన్నట్లు,కాంగ్రెస్ పార్టీ, ఏటూరునాగారం మండల అధ్యక్షులు సి హెచ్.రఘు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
అహింస,శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,ఆదేశాల మేరకు,కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనమేరకు ఈ కార్యక్రమం చేశామని తెలిపారు. అనంతరం మహాత్మ గాంధీ చేసిన పోరాటాలు, తదితర అంశాలపై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా పార్టీ కార్యదర్శి గుడ్ల దేవేందర్,మండల నాయకులు ఎండీ సలీం, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు ఎండి సులేమాన్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. (Story : మహాత్మ గాంధీ విగ్రహంకుఘన నివాళులు.రఘు)