తెలంగాణ ఆడపడుచులందరికి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు : తెలంగాణా రాష్ట్ర ఆడపడుచులందరికి, ఎంగిలి పూల బతుకమ్మ పండుగా సందర్బంగా, రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగా అన్నారు.ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే, ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు.
ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను మంత్రి సీతక్క ప్రార్థించారు.(Story :తెలంగాణ ఆడపడుచులందరికి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు)