మహత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు : జాతీపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ. ఎస్ అన్నారు. బుధవారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం లోని గాంధీ పార్కు వద్ద ఉన్నా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి-అహింస-సత్యాగ్రహం- ఆయుధాలుగా , సత్ మర్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జ చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. వారు చూపిన మార్గములో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం ప్రభుత్వా ములుగు ఏరియా ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేసి,వారి ఆరోగ్య పరిస్థితుల గురించి సంబంధిత వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంపత్ రావ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అల్లం రాజ్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ జగదీష్ , వైద్య సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు. (Story : మహత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి)