సాలూరు ఘనంగా గాంధీ జయంతి
న్యూస్ తెలుగు/సాలూరు : అహింసా ఆయుధాలూగ అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కై కృషి చేసిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సాలూరు తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు.. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు.సత్యం, అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు నుండి బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడు బోధనలు నేటికీ అనుసరణీయం. అని అన్నారు అహింసా ఆయుధాలుగా అఖండ భారతావానికి స్వేచ్ఛ స్వాతంత్రాలకై కృషిచేసిన వ్యకి జాతిపిత మహాత్మా గాంధీ. అని తెలిపారు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు మనకు మనమే వాటిని కాపాడుకోవాలని ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం అని ఆమె కొనియాడారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతి అనే ఆయుధంతో తరిమి కొట్టారని అన్నారు. ఎన్ని అవమాలను ఎదురైనా పోరాటాలు చేస్తే వాటన్నింటికి మించి అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు నుంచి దేశానికి విముక్తి కలిగించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు నిమ్మాది చిట్టి తెలుగుదేశం నాయకులు కృష్ణ . శ్యామ్ హర్ష అప్పయమ్మ .శోభారాణి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. (Story : సాలూరు ఘనంగా గాంధీ జయంతి)