జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో చెకుముకి పోటీలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక వినుకొండ శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి సంబరాలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు జీ కమలారామ్ అన్నారు. మండల స్థాయి ప్రతిభా పరీక్షలకు 18 పాఠశాల ల నుండి 54 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాల నుండి రెండు టీములు, ప్రైవేటు పాఠశాల నుండి రెండు టీములు, రూరల్ నుండి రెండు టీమ్స్ ను వినుకొండ జన విజ్ఞాన వేదిక వారు ఎంపిక చేసి వారికి పుస్తకాలు,పె న్నులు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ఆరు పాఠశాల ల నుండి ప్రథమ స్థాయిలో ఎన్నికైన మూడు స్కూల్స్ ఏపీ మోడల్ స్కూలు, జడ్పీ గర్ల్స్ హై స్కూలు, గీతాంజలి హై స్కూలు జిల్లా స్థాయికి పరీక్షలకు పంపడం జరుగుతుందని కార్యదర్శి రవికుమార్ ,జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.నాగేశ్వరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్. ఎన్. రావు, కన్వీనర్ భగవాన్ దాస్, రిటైర్డ్ హెచ్ఎం. సిహెచ్ సుబ్బారెడ్డి పాఠశాల ల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో చెకుముకి పోటీలు)