ఎం.బి.బి.ఎస్. విద్యార్థినికి ఆర్థిక సహాయం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : పూజ్య శ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ విద్యను అభ్యసిస్తున్న దూళిపాళ్ళ గ్రామం, సత్తెనపల్లి మండలానికి చెందిన కనుగుల పూజిత కి కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు , ద.ప.సువర్చల దేవి మొదటి సంవత్సరం కాలేజీ ఫీజు 25000/- స్పాన్సర్ చేశారు. రెండవ సంవత్సరం కాలేజీ ఫీజు 25000/- స్పాన్సర్ చేశారు. ప్రతి నెల కాలేజీ హాస్టల్ ఫీజు 7000/- శాంతి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేస్తున్నాం. కానుగుల పూజిత మొదటి సంవత్సరం ఫలితాలలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. ఇప్పుడు రెండవ సంవత్సరం చదువుతున్నది. కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు అందరికీ గురువు మంగళా శాసనాలు తెలిపారు. (Story : ఎం.బి.బి.ఎస్. విద్యార్థినికి ఆర్థిక సహాయం)