గీతంమ్స్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని గీతమ్స్ హై స్కూల్ నందు ముందస్తు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతంమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. అనంతరం మహాత్మా గాంధీ వేష ధారణలతో విద్యార్థులు అలరించారు. గాంధీ జ్ఞాపకార్ధం వారు అమితంగా ఇష్ట పడిన రఘుపతి రాఘవ రాజారామ్ గీతాన్ని ఆలపించారు. అనంతరం కరస్పాండెంట్ కోటిరెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో వారు చేసినటువంటి పోరాటం మరియు ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. అని వారి గూర్చి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : గీతంమ్స్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు)